గజ్వేల్ తహసీల్దార్ నివాసాలపై ఏసీబీ మెరుపుదాడులు.. 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తింపు
v6velugu·8 Mar 2026·1 min read·0
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కామతం శ్రావణ్ కుమార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసాలపై...
కరీంనగర్ నగరంలోని విద్యానగర్, ముక్రంపురా ప్రాంతాల్లో రెండు ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (ఆరు ఫ్లాట్లు), నాలుగు ఓపెన్ ప్లాట్లు, అలాగే అనేక వాహనాలు కనుగొనబడ్డాయి. వీటితో పాటు, 11.90 లక్షల రూపాయల నగదు, 4.20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులలో అధిక భాగం శ్రావణ్ కుమార్ భార్య కామతం దీప్తి పేరు మీద నమోదు చేయబడటం గమనార్హం. ఏసీబీ బృందం రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సుమారు 10 లక్షల రూపాయల నగదు ఉన్న ఒక సంచిని బయట పడేశారని తెలిసింది. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు ఆ సంచిని స్వాధీనం చేసుకుని దానిని రికవరీగా నమోదు చేశారు.