టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే కళ్లు చెదరడం ఖాయం..!
v6velugu·10 Mar 2026·2 min read·0
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారీ నజరానా ప్రకటించింది. ఇండియాకు వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ అందించిన
మొత్తం 131 కోట్ల రూపాయలను ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, అలాగే సెలెక్టర్లందరికీ పంపిణీ చేయనున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. గతంలో 2024 టీ20 ప్రపంచకప్‌ను కూడా టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. కాగా, 2026 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన సూర్యకుమార్ సేనకు ఇప్పుడు బీసీసీఐ 131 కోట్ల రూపాయల నజరానాను ప్రకటించింది. 2024తో పోలిస్తే ఈసారి బీసీసీఐ నజరానాను 6 కోట్ల రూపాయలు పెంచింది. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 2026 మార్చి 8న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఫైనల్ పోరును ఏకపక్షంగా మార్చి, వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మొత్తంగా, టీమిండియా మూడుసార్లు (2007, 2024, 2026) టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారీగా 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) అద్భుతంగా రాణించారు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 పరుగులు చేసి మెరుపు ముగింపునిచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. అనంతరం, 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. ఆది నుంచీ భారత బౌలర్లు కివీస్‌ను ఇబ్బంది పెట్టగా, ఏ దశలోనూ న్యూజిలాండ్ ఛేదన దిశగా సాగలేదు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ సీఫెర్ట్ ఒక్కడే అర్ధ సెంచరీ (52)తో ప్రతిఘటించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పరుగులతో పోరాడాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లందరూ చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ ప్రపంచకప్‌కు అడుగు దూరంలో బోల్తా పడింది.