చమురు ధర 100 డాలర్లు దాటితే పెట్రోల్ ధరల పెరుగుదల అనివార్యం..

v6velugu·7 Mar 2026·1 min read·0
చమురు ధర 100 డాలర్లు దాటితే పెట్రోల్ ధరల పెరుగుదల అనివార్యం..

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం 91 డాలర్లకు చేరింది. యుద్ధం మొదలైన నాటి నుండి చమురు ధరలు..

పెరిగిన చమురు ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడతాయి. యుద్ధ వాతావరణం వల్ల హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 100 డాలర్లకు చేరితే, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దిగుమతులపై అయ్యే ఖర్చు భారీగా పెరుగుతుంది. బ్యారెల్ ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే, భారతదేశ చమురు దిగుమతి బిల్లు సుమారు 13 నుండి 14 బిలియన్ డాలర్లు (రూ. 1.28 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా, దేశ కరెంట్ ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.3 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. వార్షికంగా, మన దేశం చమురు దిగుమతుల కోసం చెల్లించే బిల్లు 20 నుండి 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.30 లక్షల కోట్లు) పెరగనుంది. ఒకవేళ చమురు ధరలు 120 డాలర్లకు చేరితే, అప్పుడు చమురు వాణిజ్య లోటు 220 బిలియన్ డాలర్లకు చేరుకునే ప్రమాదం ఉంది. ఇది దేశ కరెంట్ ఖాతా లోటును 3 శాతం దాటించే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అంటే దిగుమతులపై అయ్యే వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిణామాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై కూడా అదనపు భారం పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రష్యా నుండి సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు వస్తుండటంతో భారత్‌కు కొంత ఉపశమనం లభించనుంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతీయ రిఫైనరీలకు అమెరికా ఒక నెల గడువు ఇచ్చింది.

Comments (0)